పిల్లలలో చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) నివారణ: లక్షణాలు మరియు వరిసెల్లా టీకా ద్వారా రక్షణ

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే
వైద్యపరంగా వరిసెల్లా 1 అని పిలిచే చికెన్ పాక్స్, ప్రధానంగా పిల్లలను1 ప్రభావితం చేసే అత్యంత సాంక్రామిక వైరస్ సంబంధ సంక్రమణ2. ఇది తరచుగా బాల్యానికి చెందిన తేలికపాటి అనారోగ్యంగా1 పరిగణించబడినప్పటికీ, కొన్నిసార్లు తీవ్రమైన ఉపద్రవాలకు దారితీయవచ్చు మరియు అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా1 మారవచ్చు.
అయితే, మీ బిడ్డను చికెన్‌పాక్స్ వ్యాధి నుండి రక్షించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం ఉంది: టీకా 1,3. చికెన్‌పాక్స్ టీకా వైరస్ నుండి రక్షిస్తుంది, తీవ్రమైన ఆకస్మిక వ్యాప్తి మరియు ఉపద్రవాల అవకాశాలను తగ్గిస్తుంది 1,3.
ఈ బ్లాగ్ చికెన్‌పాక్స్ వివరాలను, దాని లక్షణాలు, ఉపద్రవాలు మరియు ఈ సాధారణమైన కానీ నివారించగల వ్యాధి నుండి పిల్లలను సురక్షితంగా ఉంచడంలో వరిసెల్లా టీకా యొక్క ప్రాముఖ్యతతో సహా అన్వేషిస్తుంది. మరింత తెలుసుకోవటానికి చదువుతూ ఉండండి!
చికెన్‌పాక్స్ వ్యాధి గురించి తెలుసుకోవడం

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే
చికెన్‌పాక్స్ అనేది ఒక తీవ్రమైన సాంక్రామిక వ్యాధి, ఇది దురదతో కూడిన ఎర్రటి దద్దుర్లను కలిగి ఉంటుంది, అవి చివరగా ద్రవంతో నిండిన బొబ్బలుగా వృద్ధి చెందుతాయి1,2. హెర్పెస్ వైరస్ తరగతికి చెందిన అత్యంత సాంక్రామిక డిఎన్ఏ వైరస్ అయిన వరిసెల్లా-జోస్టర్ వైరస్ ద్వారా ఈ వ్యాధి కలుగుతుంది1.
వరిసెల్లా-జోస్టర్ వైరస్ గాలిలో బిందువులు లేదా ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, వైరస్‌తో కూడిన చిన్న లాలాజల బిందువులు గాలిలోకి విడుదలవుతాయి మరియు ఇతరులు వాటిని పీల్చవచ్చు, సంక్రమణకు దారితీయవచ్చు. చికెన్‌పాక్స్ సోకిన వ్యక్తి1,2 బొబ్బల నుండి వచ్చే ద్రవాన్ని తాకడం ద్వారా కూడా అది వ్యాపిస్తుంది.
చికెన్‌పాక్స్ గల వ్యక్తితో దగ్గరి సంబంధం అంటువ్యాధికి దారితీయవచ్చు, ప్రత్యేకించి మీకు టీకాలు వేయకపోతే లేదా ఇంతకు ముందు ఆ వ్యాధి రాకపోతే 1.
చికెన్‌పాక్స్ వ్యాధి గల వ్యక్తి దద్దుర్లు కనిపించడానికి 1 నుండి 2 రోజుల ముందు నుండి అన్ని బొబ్బలు పై పొరలుగా మారే వరకు అంటువ్యాధి వ్యాప్తికి కారణం అవుతారు 1. ఈ వ్యాధి సాధారణంగా 1 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ప్రభావితం చేస్తుంది, అయితే పెద్ద పిల్లలు, పెద్దలు మరియు టీకాలు పొందని, గతంలో చికెన్‌పాక్స్ బారిన పడని వ్యక్తులు కూడా ప్రమాదంలో ఉన్నారు1.
సాధారణంగా, చికెన్‌పాక్స్ 5 నుండి 7 రోజుల వరకు ఉంటుంది1. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది న్యుమోనియా, బాక్టీరియా, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), నిర్జలీకరణ లేదా రక్తప్రవాహ అంటువ్యాధులు (సెప్సిస్) వంటి తీవ్రమైన ఉపద్రవాలకు దారితీయవచ్చు1,2. ఈ ఉపద్రవాలు అధిక-ప్రమాదకరమైన సమూహాలలో ఎక్కువగా ఉంటాయి, వాటిలో 1,2:
అకాలంలో ప్రసవాలు
శిశువులు
కౌమారులు
వయోజనులు
గర్భిణీలు
బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు గల వ్యక్తులు
టీకాలు వేయడం వల్ల చికెన్‌పాక్స్ వ్యాధి సంక్రమించే ప్రమాదం మరియు తీవ్రమైన లక్షణాలు లేదా ఉపద్రవాలు ఎదుర్కునే ప్రమాదం ప్రభావవంతంగా తగ్గుతుంది, మీ బిడ్డను మరియు వారి చుట్టూ ఉన్నవారిని రక్షించడంలో సహాయపడుతుంది 1,3.
చికెన్‌పాక్స్ వ్యాధికి చెందిన సాధారణ లక్షణాలు
చికెన్‌పాక్స్ వ్యాధికి సగటు ఇన్‌క్యుబేషన్(రోగబీజములు పుట్టిపెరిగేస్థితి) కాలం, అంటే వైరస్ బారిన పడినప్పటి నుండి లక్షణాలు కనిపించడానికి మధ్య సమయం, 14 నుండి 15 రోజుల వరకు ఉంటుంది. అయితే, వైరస్ బారిన పడిన తరువాత లక్షణాలు 10 నుండి 21 రోజుల వరకూ ఎప్పుడైనా కనిపించవచ్చు.
చికెన్‌పాక్స్ యొక్క ప్రాథమిక సంకేతం దద్దుర్లు, ఇది దురద, ద్రవంతో నిండిన బొబ్బలుగా పరిణామం చెందుతుంది, ఇది చివరికి గట్టి పొరగా మారుతుంది. ఈ దద్దుర్లు శరీరమంతా వ్యాపించే ముందు సాధారణంగా ఛాతీ, వీపు మరియు ముఖంపై ప్రారంభమై, నోరు, కనురెప్పలు, మాడు, చేతులు మరియు కాళ్ళతో సహా వ్యాపిస్తాయి. కొన్నిసార్లు, శ్లేష్మ పొరలు మరియు జననేంద్రియ భాగంను కూడా ప్రభావితం చేయవచ్చు1,2.
చికెన్‌పాక్స్ ఉన్న వ్యక్తికి 1000 కంటే ఎక్కువ గాయాలు1 ఏర్పడవచ్చు మరియు అవన్నీ గట్టి పొరగా1 మారడానికి సాధారణంగా ఒకటి నుండి రెండు వారాలు పడుతుంది.
అదనంగా, దద్దుర్లు రావడానికి 1 నుండి 2 రోజుల ముందు కొన్ని ఇతర లక్షణాలు కనిపించవచ్చు, వాటిలో2:
తేలికపాటి జ్వరం
ముక్కు కారడం మరియు దగ్గు
అలసట లేదా అలసిపోవడం
తలనొప్పి
చికెన్ పాక్స్ సాధారణంగా తేలికపాటిది 1,2 అయినప్పటికీ, ముఖ్యంగా అధిక ప్రమాదానికి గురయ్యే అవకాశమున్న వ్యక్తులలో ఇది తీవ్రమైన ఉపద్రవాలకు దారితీయవచ్చు1. ఈ ఉపద్రవాలు, ఆరోగ్యకరమైన వ్యక్తులలో అరుదుగా ఉన్నప్పటికీ, వీటిని కలిగి ఉండవచ్చు1:
గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకల్ అంటువ్యాధుల వంటి చర్మం మరియు మృదువైన కణజాలాల యొక్క బాక్టీరియా సంబంధ సంక్రమణలు
ఊపిరితిత్తుల అంటువ్యాధులు (న్యుమోనియా)
మెదడు అంటువ్యాధులు లేదా శోథ (ఎన్సెఫాలిటిస్, సెరెబెల్లార్ అటాక్సియా)
రక్త స్రావ సమస్యలు (హెమరాజిక్ ఉపద్రవాలు)
సెప్సిస్
నిర్జలీకరణ
తీవ్రమైన సందర్భాల్లో, చికెన్‌పాక్స్ కారణంగా ఆసుపత్రిలో చేరవలసి రావచ్చు మరియు ప్రాణాంతకం కావచ్చు1.
ఒక మహిళ గర్భం దాల్చిన మొదటి ఆరు వారాల్లోపు చికెన్‌పాక్స్‌కు గురైతే, అది పుట్టబోయే బిడ్డలో తీవ్రమైన అసాధారణతలకు కారణం కావచ్చు. బిడ్డ రోగనిరోధక వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందనందున, ప్రసవతేదీకి చేరువలో అంటువ్యాధికి గురైతే అది బిడ్డకు ప్రాణాంతకం కావచ్చు1.
చికెన్‌పాక్స్ వల్ల కలిగే మరో సంభావ్య ఉపద్రవం షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) లేదా హెర్పెస్ జోస్టర్. చికెన్‌పాక్స్ నుండి కోలుకున్న తర్వాత, వరిసెల్లా-జోస్టర్ వైరస్ శరీరంలోని జ్ఞాన నాడి గాంగ్లియాలో నిద్రాణంగా ఉంటుంది. ఈ వైరస్ సంవత్సరాల తర్వాత తిరిగి క్రియాశీలం కావచ్చు, షింగిల్స్‌కు(బాధాకరమైన దద్దుర్లు) దారితీయవచ్చు, ఇది నొప్పితోకూడిన దద్దురుగా ఉంటుంది. షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) సోకిన వయోజనులు రోగనిరోధక శక్తి లేని ఇతరులకు వైరస్ సోకేట్టు చేయవచ్చు, ఈ కారణంగా వారికి చికెన్‌పాక్స్ వస్తుంది 1
చికెన్‌పాక్స్ వ్యాధిని నివారించడంలో వరిసెల్లా టీకా పాత్ర
చికెన్‌పాక్స్ నుండి పిల్లలను రక్షించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం వరిసెల్లా టీకా1,3. టీకా యొక్క బలహీనమైన వైరస్ రూపానికి రోగనిరోధక వ్యవస్థను బహిర్గతం చేయడం ద్వారా టీకా పనిచేస్తుంది, తద్వారా శరీరం అనారోగ్యానికి గురికాకుండా రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడాన్ని అనుమతిస్తుంది4.
చికెన్‌పాక్స్ టీకా ప్రభావవంతమైనది - రెండు మోతాదులు పొందిన 90% కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్ నుండి రక్షించబడతారు 3. టీకాలు వేసిన పిల్లలకు పురోగమిస్తున్న చికెన్‌పాక్స్ అని పిలువబడే వైరస్ సంక్రమించిన సందర్భాల్లో, అనారోగ్యం సాధారణంగా తేలికపాటిగా ఉంటుంది. తరచుగా ఈ పిల్లలకు బొబ్బలు తక్కువగా లేదా అస్సలు ఉండవు మరియు కనీసమైన జ్వరాన్ని అనుభవిస్తారు, అయినప్పటికీ ఇంకనూ కొన్ని ఎర్రటి మచ్చలు కనిపించవచ్చు2,3.
చికెన్‌పాక్స్ టీకా రెండు మోతాదులుగా ఇవ్వబడుతుంది: 5
15 నెలల వద్ద మొదటి మోతాదు
18 మరియు 24 నెలల మధ్య రెండవ మోతాదు
అదనంగా, టీకా చికెన్‌పాక్స్‌తో సంబంధం ఉన్న సంభావ్య ఉపద్రవాలను నివారించడంలో సహాయపడుతుంది1,2.
7-స్టార్ టీకా కార్యక్రమం అనేది ఐఏపి అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసస్ (ఏసివిఐపి) మార్గదర్శకాల ఆధారంగా సమగ్రమైన మరియు చక్కగా నిర్మాణాత్మకమైన షెడ్యూల్ 5. చికెన్‌పాక్స్, హెపటైటిస్ ఎ, ఫ్లూ, రుబెల్లా, గవదబిళ్ళలు, మెనింజైటిస్ మరియు మరిన్నింటితో సహా పద్నాలుగు వేర్వేరు అనారోగ్యాలను కవర్ చేసే ఏడు కీలక టీకాలను చేర్చడం ద్వారా ఇది విస్తృత శ్రేణితో కూడిన నివారించగల వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది.
వివరణాత్మక సమాచారం కోసం మరియు మీ బిడ్డ 7-స్టార్ ప్రొటెక్షన్ షెడ్యూల్ అందుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి, మీ శిశువైద్యుడిని సంప్రదించండి.
ముగింపు
చికెన్‌పాక్స్ అనేది అత్యంత సాంక్రామికమైనది అయినప్పటికీ నివారించగల వ్యాధి, ఇది సాధారణంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది 1,2. లక్షణాలు మరియు ఉపద్రవాల గురించి తెలుసుకోవడం ద్వారా మరియు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలను చికెన్‌పాక్స్ వల్ల కలిగే అసౌకర్యం మరియు సంబంధిత ప్రమాదాల నుండి రక్షించవచ్చు.
చికెన్‌పాక్స్ టీకాలు వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా తగ్గిస్తాయి మరియు తీవ్రమైన ఉపద్రవాలను నివారిస్తాయి 1,2,3. మీ బిడ్డకు టీకాలను షెడ్యూల్ ప్రకారం వేయించారని నిర్ధారించుకోవడానికి మరియు చికెన్‌పాక్స్ వ్యాధిని నివారించడం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే చర్చించడానికి మీ శిశువైద్యుడిని సంప్రదించండి.
References
- Heininger U, Seward JF, (KC). Varicella. The Lancet 2006; 368:1365–1376.
- c=AU, & o=The State of Queensland. (n.d.). Chickenpox (varicella). Gov.au. Retrieved January 10, 2025, from https://www.qld.gov.au/health/condition/infections-and-parasites/viral-infections/chickenpox-varicella
- (N.d.). Hhs.gov. Retrieved January 10, 2025, from https://www.hhs.gov/immunization/diseases/chickenpox/index.html
- CDC. (2024, August 10). Explaining how vaccines work. Vaccines & Immunizations. https://www.cdc.gov/vaccines/basics/explaining-how-vaccines-work.html?CDC_AA_refVal=https%3A%2F%2Fwww.cdc.gov%2Fvaccines%2Fhcp%2Fconversations%2Funderstanding-vacc-work.html
- Indra M, Kasi SG, Shashi Kant Dhir, Wadhwa A, B. Rajsekhar, Chandra Mohan Kumar, et al. Indian Academy of Pediatrics (IAP) Advisory Committee on Vaccines and Immunization Practices (ACVIP): Recommended Immunization Schedule (2023) and Update on Immunization for Children Aged 0 Through 18 Years. Indian pediatrics/Indian Pediatrics. 2024 Jan 15;61(2):113–25.
CL Code: NP-IN-PVU-WCNT-240014 DoP Jan 2025
మరింత చదవండి
-
టీకా ద్వారా కాల సంబంధిత ఫ్లూ (విషపడిసెం) నుండి వయోజనులు మరియు పిల్లలను రక్షించటం
19-03-2025Read more »
-
శిశువులు మరియు చిన్న పిల్లలలో విషపడిశెంను నివారించటం: తల్లిదండ్రులుగా మీరు ఏమి చేయగలరు?
19-03-2025Read more »