షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు మధుమేహం: సంబంధం, ప్రభావం మరియు నివారణ

sticker banner

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

మధుమేహంతో జీవితం ఒక సవాలుగా ఉంటుంది, ఇది రోజువారీ జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, సంక్లిష్టమైన మందుల నియమావళి మరియు ఆహార పరిమితులనేవి మధుమేహం ఉన్నవారు ఎదుర్కొనే కొన్ని అడ్డంకులు.1

మధుమేహ నిర్వహణ సవాలుతో కూడినప్పటికీ, దాని ప్రభావం లేదా అది ఇతర వ్యాధులను ఎలా ఆకర్షిస్తుందనే దాని గురించి తెలుసుకోవడాన్ని తప్పించుకోకూడదు.1

సాధారణంగా షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) అని పిలువబడే హెర్పెస్ జోస్టర్ ఏర్పడే ప్రమాదాన్ని మధుమేహం పెంచుతుందని అనేకమైన ఆధారాలు చూపిస్తున్నాయి.2

రెండు పరిస్థితుల మధ్య సంబంధం మరియు దాని ప్రభావాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

మధుమేహం అంటే ఏమిటి?

 

మధుమేహం అనేది మీ శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తిలేకపోవడం లేదా సమర్థవంతంగా వాడకపోవడం కారణంగా ఇది రక్తంలో చక్కెర పెరగడం ద్వారా వర్గీకరించబడుతుంది.3,4

టైప్ 1 (ఇన్సులిన్ లోపించడం) మరియు టైప్ 2 (ఇన్సులిన్ నిరోధకత) అనే 2 రకాల మధుమేహాలు ఉన్నాయి.4

 

  • టైప్ 1 మధుమేహం

శరీర రక్షణ వ్యవస్థ పొరపాటున తనపై తానే దాడి చేసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. దీనిని నియంత్రించకపోతే గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కంటిచూపు సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.4

 

  • టైప్ 2 మధుమేహం

ఈ పరిస్థితిలో, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం మరియు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో ఇబ్బంది పడుతుంది. మధుమేహం ఉన్న చాలా మందికి టైప్ 2 ఉంటుంది. ఇది సాధారణంగా నిదానంగా ప్రారంభమవుతుంది మరియు తరచుగా వయోజనులలో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు పిల్లలు, కౌమారులు మరియు యువతకు కూడా ఇది రావచ్చు.4

Shingles-and-Diabetes

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

రోగనిరోధక వ్యవస్థపై మధుమేహం యొక్క ప్రభావాలు

 

మధుమేహంలోని హైపర్‌‌‌గ్లైసీమియా రోగనిరోధక స్పందన పని చేయకపోవడానికి కారణమై, మధుమేహ కర్తలలో దాడి చేసే వ్యాధికారకాల వ్యాప్తిని నియంత్రించడంలో విఫలమవుతుందని భావించబడుతుంది.5

దీని అర్థం ఒక వ్యక్తికి మధుమేహం ఉన్నప్పుడు మరియు వారి రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (హైపర్‌గ్లైసీమియా), ఇది వారి రోగనిరోధక శక్తిని సరిగా పనిచేయకుండా చేయవచ్చు.

పర్యవసానంగా, మధుమేహంతో ఉన్న వ్యక్తులు సంక్రమణలకు గురికావడానికి ఎక్కువ అవకాశముంది.5

 

మధుమేహం మీ షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది?

 

మధుమేహం అనేది రక్తనాళాలు దెబ్బతినడం వల్ల మెదడు, మూత్రపిండాలు, గుండె, కళ్ళు వంటి అవయవాలను ప్రభావితం చేసే వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచే ఒక దీర్ఘకాలిక పరిస్థితి. ఇది వ్యక్తులను సంక్రమణలకు ఎక్కువగా గురయ్యేలా కూడా చేస్తుంది.5

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రమాదాన్ని పెంచుతుంది కనుక, మధుమేహంతో ఉన్న వ్యక్తి ఎక్కువగా హానికి గురవుతారు. హెర్పెస్ జోస్టర్ వచ్చే ప్రమాదాన్ని మధుమేహం 40% మేరకు పెంచుతుంది. 6,7

 

మధుమేహంపై షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రభావం

 

మధుమేహంతో ఉన్న వ్యక్తులు హెర్పెస్ జోస్టర్ యొక్క గణనీయమైన సవాళ్లను ఎదుర్కునేలా చేస్తుంది.2

  • గ్లైసెమిక్ నియంత్రణపై ప్రభావం: మధుమేహ రోగులలో గ్లైసెమిక్ నియంత్రణను (ఉత్తమ సీరం గ్లూకోజ్ సాంద్రత) హెర్పెస్ జోస్టర్ మరింత తీవ్రతరం చేస్తుంది.8  ఒక అధ్యయనంలో, హెర్పెస్ జోస్టర్ సంక్రమణ కలిగిన తర్వాత సరైన నియంత్రణను కలిగి ఉన్న మధుమేహ రోగులలో సుమారు 24% మంది  హెచ్‌బిఎ1సి (సగటు రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయిని కొలిచే రక్త పరీక్ష) ద్వారా కొలిచే వారి గ్లైసెమిక్ నియంత్రణలో క్షీణతను పొందారు.8
Shingles-and-Diabetes

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

  • సమస్యలు మరియు తీవ్రత: మధుమేహం రోగనిరోధక వ్యవస్థను5 ప్రభావితం చేస్తుంది కనుక, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) యొక్క లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు.2

 

  • మధుమేహ నిర్వహణలో జోక్యం: మధుమేహ రోగులు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) తరువాత వారి రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అదనంగా, వారు ఈ సమయంలో ఇతర ఆరోగ్య సమస్యల కొరకు ఆసుపత్రి పాలవడానికి ఎక్కువ అవకాశం ఉంది.2

 

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) (హెర్పెస్ జోస్టర్) అంటే ఏమిటి

 

హెర్పెస్ జోస్టర్ అని కూడా పిలిచే, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు), బొబ్బలతో బాధాకరమైన చర్మపు దద్దురును కలిగించే ఒక సంక్రమణ. చికెన్‌పాక్స్ (ఆటలమ్మ)కు కారణమయ్యే వారిసెల్లా-జోస్టర్ వైరస్ అయిన వైరసే షింగిల్స్‌కు కారణమవుతుంది. ఒక వ్యక్తికి ఆటలమ్మ సోకిన తరువాత, వైరస్ వారి శరీరంలో నిద్రాణంగా ఉంటుంది మరియు జీవితంలో తరువాత తిరిగి క్రియాశీలకం కావచ్చు, షింగిల్స్‌కి దారితీయవచ్చు.9

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రమాదాన్ని పెంచుతుంది మరియు అందువల్ల వృద్ధులైన వయోజనులలో ఇది సర్వసాధారణంగా ఉంటుంది, మరియు వయస్సుతో పాటు ఈ పరిస్థితి అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది.10

భారతీయులైన కర్తలలో ఒక సెరోప్రివలెన్స్ అధ్యయనం ప్రకారం 50 సంవత్సరాల వయస్సు నాటికి, 90% కంటే ఎక్కువ మంది వారి శరీరంలో వరిసెల్లా-జోస్టర్ వైరస్‌ను కలిగి ఉన్నారని పేర్కొన్నారు, ఇది వారు షింగిల్స్‌కు గురయ్యేట్టు చేస్తుంది.11,12

Shingles-and-Diabetes

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) లక్షణాలు

 

దద్దురు కనిపించడానికి ముందు, వ్యక్తులు ప్రభావిత ప్రాంతంలో నొప్పి, దురద లేదా జలదరింపును అనుభవించవచ్చు, ఇది తరచుగా చాలా రోజుల ముందు సంభవిస్తుంది. దద్దుర్లు రావడానికి ముందు కొంతమందికి జ్వరం కూడా రావచ్చు.13

 

సాధారణ లక్షణాలు:

 

  • దద్దుర్లు, సాధారణంగా నొప్పిగా మరియు దురదగా ఉండి, బొబ్బలను కలిగి ఉంటాయి, ఇవి సాధారణంగా 7 నుండి 10 రోజుల వ్యవధిలో పొక్కులుగా ఏర్పడతాయి, చివరికి 2 నుండి 4 వారాల వ్యవధిలో పూర్తిగా నయం అయిపోతాయి.13

  • దద్దురు సాధారణంగా శరీరం యొక్క ఎడమ లేదా కుడి వైపున ఒకే పట్టీలో సంభవిస్తుంది.9

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) దద్దురు ముఖం యొక్క ఒక వైపు సంభవించవచ్చు, ఇది కంటిని ప్రభావితం చేయవచ్చు మరియు దృష్టి నష్టాన్ని కలిగించవచ్చు.13

     

ఇతర లక్షణాలలో ఇవి ఉండవచ్చు13:

 

  • తలనొప్పి  
  • వణుకులు
  • కడుపు పాడవడం
Shingles-and-Diabetes

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) నివారణ

 

షింగిల్స్‌ను నివారించడంలో టీకా సహాయపడగలదు.14 షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) టీకా 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు సిఫార్సు చేయబడింది. 15,16

References

  1.  10 Tips for coping with diabetes distress [Internet]. Cdc.gov. 2022 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/diabetes/managing/diabetes-distress/ten-tips-coping-diabetesdistress.html
  2. Papagianni M, Metallidis S, Tziomalos K. Herpes Zoster and Diabetes Mellitus: A Review. Diabetes Ther. 2018 Apr;9(2):545-550. 
  3. CDC. What is diabetes? [Internet]. Centers for Disease Control and Prevention. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/diabetes/basics/diabetes.html
  4. Berbudi A, Rahmadika N, Tjahjadi AI, Ruslami R. Type 2 Diabetes and its Impact on the Immune System. Curr Diabetes Rev. 2020;16(5):442-449. 
  5. Batram M, Witte J, Schwarz M, Hain J, et al. Burden of Herpes Zoster in Adult Patients with Underlying Conditions: Analysis of German Claims Data, 2007-2018. Dermatol Ther (Heidelb). 2021 Jun;11(3):1009-1026.
  6. Marra F et al. Open Forum Infect Dis. 2020;7:1-8.
  7. Huang CT, Lee CY, Sung HY, et al. Association Between Diabetes Mellitus and the Risk of Herpes Zoster: A Systematic Review and Meta-analysis. J Clin Endocrinol Metab. 2022 Jan 18;107(2):586-597.
  8. Muñoz-Quiles C, López-Lacort M, Ampudia-Blasco FJ, Díez-Domingo J. Risk and impact of herpes zoster on patients with diabetes: A population-based study, 2009–2014. Hum Vaccin Immunother [Internet]. 2017 [cited 2023 Sep 11];13(11):2606–11. [Accessed 2023 Sep 11] Available at: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5798425/
  9. Clinical overview [Internet]. Cdc.gov. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/shingles/hcp/clinical-overview.html
  10. Five things you should know about shingles [Internet]. Cdc.gov. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/shingles/5-things-you-should-know.html
  11. Lokeshwar MR, Agrawal A, Subbarao SD, Chakraborty MS, Av RP, Weil J, et al. Age related seroprevalence of antibodies to varicella in India. Indian Pediatr [Internet]. 2000 [cited 2023 Sep 11];37(7). [Accessed 2023 Sep 11] Available at: https://pubmed.ncbi.nlm.nih.gov/10906803/
  12. GSK launches Shingrix in India- A vaccine for the prevention of shingles in adults aged 50 years and above [Internet]. Gsk.com. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://india-pharma.gsk.com/en-in/media/press-releases/gsk-launches-shingrix-in-india-a-vaccine-for-the-prevention-of-shingles-in-adults-aged-50-years-and-above/
  13. Signs and symptoms [Internet]. Cdc.gov. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/shingles/about/symptoms.html
  14. Prevention and treatment [Internet]. Cdc.gov. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://cdc.gov/shingles/about/treatment.html
  15. CDC. Shingles vaccination [Internet]. Centers for Disease Control and Prevention. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/vaccines/vpd/shingles/public/shingrix/index.html
  16. Adult immunization schedule – healthcare providers [Internet]. Cdc.gov. 2023 [cited 2023 Sep 11]. [Accessed 2023 Sep 11] Available at: https://www.cdc.gov/vaccines/schedules/hcp/imz/adult.html
     

CL Code: NP-IN-HZU-WCNT-230018 DoP: Sep 2023

మరింత చదవండి

  • కార్డియోవాస్క్యులర్ వ్యాధులు మరియు షింగిల్స్: వాటి సంబంధం మరియు ప్రభావం అర్థం చేసుకోవటం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ దద్దురు మరియు లక్షణాలను అర్థం చేసుకోవటం: మీరు ఏమి తెలుసుకోవలసి ఉంది

    19-03-2025
    Read more »
  • ఊపిరితిత్తుల వ్యాధి గల రోగులలో షింగిల్స్: ఆస్తమా మరియు COPDల ప్రభావం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ వ్యాధి మరియు లక్షణాలు: సంకేతాలు మరియు నివారణ పూర్తి స్థూల దృష్టి

    19-03-2025
    Read more »
  • హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) యొక్క కారణాలను గుర్తించడం

    18-03-2025
    Read more »