హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) యొక్క కారణాలను గుర్తించడం

sticker banner

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

హెర్పెస్ జోస్టర్, తరచుగా దీనిని షింగిల్స్ అని పిలుస్తారు, ఇది భరించలేని బాధాకరమైన వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఒక వ్యక్తి జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది 1#. బలహీనపరిచే ఈ పరిస్థితి నిద్ర, పని మరియు వ్యక్తిగత సంబంధాలకు అంతరాయం కలిగించవచ్చు, ఇది శారీరక అసౌకర్యం మరియు మానసిక క్షోభకు దారితీస్తుంది 1 . 

చాలా మందికి బాధాకరమైన, ఎరుపు దద్దుర్ల గురించి తెలిసినప్పటికీ, ఈ పరిస్థితికి సంబంధించిన అంతర్లీన కారణాలు మరియు ప్రమాద కారకాలు తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు.  

హెర్పెస్ జోస్టర్ వ్యాధి యొక్క సంక్లిష్టతలను అన్వేషిద్దాం, దాని కారణాలు, లక్షణాలు మరియు నివారణను బాగా అర్థం చేసుకుందాం. 

 

హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్)ను ఒక వ్యాధిగా అర్థం చేసుకోవడం

 

హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ యొక్క పునఃసక్రియం వల్ల కలిగే బాధాకరమైన వైరల్ వ్యాధి, ఇది చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) రావడానికి కారణమయ్యే వైరస్ 2#. ఒక వ్యక్తికి చికెన్‌పాక్స్ వచ్చిన తర్వాత, వైరస్ నాడీ వ్యవస్థలో నిద్రాణంగా లేదా క్రియారహితంగా ఉంటుంది. ఇది అనేక సంవత్సరాల తర్వాత తిరిగి క్రియాశీలమవుతుంది , దీని వలన బాధాకరమైన ఎర్రటి దద్దుర్లు వస్తాయి 2#.

హెర్పెస్ జోస్టర్ దద్దుర్లు సాధారణంగా శరీరం యొక్క ఎడమ లేదా కుడి వైపున లేదా శరీరంలోని ఇతర భాగాలపై ఒకే, పొక్కుల చారగా కనిపిస్తాయి. ఈ దద్దుర్లు సాధారణంగా 2 నుండి 4 వారాలలోపు తగ్గిపోతాయి 3

దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో హెర్పెస్ జోస్టర్‌ను అనుభవించవచ్చు 4.  

 

హెర్పెస్ జోస్టర్ యొక్క ప్రమాదాలు మరియు కారణాలు ఏమిటి

 

వరిసెల్లా-జోస్టర్ వైరస్ అనేది హెర్పెస్ జోస్టర్ వ్యాధికి కారణమవుతుంది మరియు చికెన్‌పాక్స్ (వరిసెల్లా) కు కారణమయ్యే అదే వైరస్ 2. చికెన్‌పాక్స్ సాధారణంగా బాల్యంలో ప్రాథమిక వరిసెల్లా-జోస్టర్ వైరస్ సంక్రమణగా సంభవిస్తుంది 5. చికెన్‌పాక్స్ దురద దద్దుర్లుగా కనిపిస్తుంది, ఇది చిన్న గడ్డలు మరియు బొబ్బలతో మొదలై చివరికి 7 నుండి 10 రోజుల్లో ఎండిన క్రస్ట్‌లు (స్కాబ్స్) గా ఏర్పడుతుంది. మీకు చికెన్‌పాక్స్ వచ్చి ఉంటే, ఆ వైరస్ మీ శరీరంలో తిరిగి క్రియాశీలమై, షింగిల్స్‌కు కారణమవుతుంది 2

వరిసెల్లా-జోస్టర్ వైరస్ పునఃక్రియాశీలం కావడానికి ఖచ్చితమైన కారణం పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇది ప్రత్యేకంగా ఈ వైరస్‌కు కణ-మధ్యస్థ రోగనిరోధక శక్తి క్షీణతతో ముడిపడి ఉందని నమ్ముతున్నారు 6. ఈ క్షీణత సహజంగా వృద్ధాప్యంతో లేదా రోగనిరోధక శక్తిని బలహీనపరిచే కొన్ని వైద్య పరిస్థితుల వల్ల సంభవించవచ్చు. 

హెర్పెస్ జోస్టర్ కారణ కారకాలు:  

  • మునుపటి చికెన్‌పాక్స్ ఇన్ఫెక్షన్: చికెన్‌పాక్స్ వచ్చిన ఎవరికైనా తరువాతి జీవితంలో షింగిల్స్ వచ్చే ప్రమాదం ఉంది 2
  • వయస్సు: హెర్పెస్ జోస్టర్ వ్యాధి వచ్చే ప్రమాదం వయస్సుతో గణనీయంగా పెరుగుతుంది. 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ పరిస్థితి 4, వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, 50 ఏళ్లు పైబడిన పెద్దలలో 90% మంది వైరస్‌ను కలిగి ఉంటారు 7. వయస్సుతో పాటు రోగనిరోధక పనితీరు బలహీనపడటంతో 8, వైరస్ తిరిగి క్రియాశీలమై హెర్పెస్ జోస్టర్‌కు కారణమవుతుంది.
  • కుటుంబ చరిత్ర: హెర్పెస్ జోస్టర్ చరిత్ర కలిగిన తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఉండటం వలన మీ ప్రమాదం 2.4 రెట్లు పెరుగుతుంది 9
  • నిర్దిష్ట వైద్య పరిస్థితులు: నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు హెర్పెస్ జోస్టర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు వారికి మరింత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితులలో ఇవి ఉన్నాయి: 
    • క్యాన్సర్ 9
    • మధుమేహం 10
    • ఆటోఇమ్యూన్ వ్యాధులు (రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటివి) 9
    • దీర్ఘకాలిక ఊపిరితిత్తుల పరిస్థితులు (దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఉబ్బసం, మొదలైనవి)11
    • గుండెలోని రక్త నాళాల వ్యాధి 9
  • ఒత్తిడి 9
  • వైద్య చికిత్స1
Zoster 2

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) సంకేతాలు మరియు లక్షణాలు

 

హెర్పెస్ జోస్టర్ యొక్క మొదటి లక్షణాలు భరించలేని నొప్పి మరియు మండే అనుభూతి, సాధారణంగా శరీరం యొక్క ఒక వైపున ఉంటాయి 14#. ఈ నొప్పి విద్యుత్ షాక్‌లు 15# లేదా గోర్లు పెట్టి గుచ్చినట్లు  15, అనిపించవచ్చు, ఇది వారాలు లేదా నెలల పాటు ఉంటుంది 16#. చాలా మంది వ్యక్తులు దీనిని చికెన్ పాక్స్ 17# కంటే ఎక్కువ బాధాకరమైనదిగా మరియు గర్భధారణ సమయంలో ప్రసవ నొప్పిగా కూడా అభివర్ణిస్తారు 18#

హెర్పెస్ జోస్టర్ వ్యాధి యొక్క భరించలేని నొప్పి జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది 1#:  

  • నిద్ర

  • పని ఉత్పాదకత

  • కుటుంబంతో గడిపే నాణ్యమైన సమయం

  • రోజువారీ కార్యకలాపాలను ఆస్వాదించడం

Zoster 4

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

నొప్పి తర్వాత, ఎర్రటి దద్దుర్లు వృద్ధి చెందుతాయి, శరీరానికి ఒక వైపు అంటే ఎడమ లేదా కుడి వైపున చిన్న, ద్రవంతో నిండిన బొబ్బల బ్యాండ్‌ మాదిరిగా కనిపిస్తాయి 14. దద్దుర్లు ఒక కన్ను చుట్టూ లేదా ముఖం యొక్క ఒక వైపు కూడా సంభవించవచ్చు14

అరుదైన సందర్భాల్లో, దద్దుర్లు శరీరం అంతటా వ్యాపించి చికెన్‌పాక్స్ దద్దుర్లు లాగా ఉంటాయి14. ఇది సాధారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులలో జరుగుతుంది 14

సాధారణ దద్దుర్లతో పాటు, ఇతర హెర్పెస్ జోస్టర్ లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు14

  • జ్వరం
  • వణుకు
  • అలసట
  • తలనొప్పి
  • కడుపులో బాగుండకపోవటం

 

ఈ లక్షణాలకు మించి, హెర్పెస్ జోస్టర్ అనేక సమస్యలకు దారితీస్తుంది, వాటిలో: 

  • పోస్ట్‌హెర్పెటిక్ న్యూరాల్జియా (PHN) - హెర్పెస్ జోస్టర్ కొనసాగితే, అది పోస్ట్‌హెర్పెటిక్ న్యూరాల్జియాకు దారితీస్తుంది, ఇది దద్దుర్లు తగ్గిన తర్వాత కూడా కొనసాగే నిరంతర నరాల నొప్పి19#. దెబ్బతిన్న నరాలు మెదడుకు మిశ్రమ సంకేతాలను పంపినప్పుడు PHN సంభవిస్తుంది, దీని ఫలితంగా నెలలు లేదా సంవత్సరాల పాటు ఉండే తీవ్రమైన మరియు దీర్ఘకాలిక నొప్పి వస్తుంది19#. ఈ సమస్య ఇన్ఫెక్షన్ 19 ఉన్న ప్రతి 4 మందిలో 1 రిని ప్రభావితం చేస్తుంది మరియు వృద్ధులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది19.  
  • హెర్పెస్ జోస్టర్ ఆప్తాల్మికస్ (HZO) - హెర్పెస్ జోస్టర్ ఆప్తాల్మికస్ అనేది కన్ను లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేసే షింగిల్స్. ఇది 4 మంది షింగిల్స్ రోగులలో 1 రికిసంభవించవచ్చు 20 మరియు HZO ఉన్నవారిలో సగం మంది వరకు బాధాకరమైన కంటి ఇన్ఫెక్షన్లు మరియు శాశ్వత దృష్టి నష్టం 20 వంటి నేత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.
  • మెదడువాపు - హెర్పెస్ జోస్టర్ వ్యాధి సోకిన వ్యక్తులలో దాదాపు 1% మందికి మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్) రావచ్చు21, ఇది తలనొప్పి, జ్వరం, గందరగోళం మరియు మూర్ఛలు వంటి లక్షణాలతో కూడిన నాడీ సంబంధిత సమస్య.
  • హెర్పెస్ జోస్టర్ ఓటికస్ - వరిసెల్లా-జోస్టర్ వైరస్ శ్రవణ వ్యవస్థలో తిరిగి క్రియాశీలం కాగలదు, ఫలితంగా హెర్పెస్ జోస్టర్ ఓటికస్ వస్తుంది22. లక్షణాలు వినికిడి లోపం, తలతిరుగుడు, టిన్నిటస్ మరియు తీవ్రమైన ముఖ నొప్పిని కలిగి ఉండవచ్చు22
  • రామ్సే హంట్ సిండ్రోమ్ - హెర్పెస్ జోస్టర్ వ్యాధి ముఖ నరాలను ప్రభావితం చేస్తుంది, దీని వలన రామ్సే హంట్ సిండ్రోమ్ అని పిలువబడే ముఖ పక్షవాతం వస్తుంది22

 

హెర్పెస్ జోస్టర్‌ను నివారించడానికి చర్యలు

Zoster 5

కల్పిత చిత్రం, కేవలం చిత్రీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే

హెర్పెస్ జోస్టర్ వ్యాధి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది, ఇది రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది 1#. ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఉత్తమ మార్గం టీకాలు వేయడం 23. 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు అందుబాటులో ఉన్న ఈ టీకా 23, శరీరం యొక్క సహజ రక్షణను పెంచడం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ఇది వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది 24

సరళంగా చెప్పాలంటే, టీకాలు ఇన్ఫెక్షన్‌ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి, శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి 24. ఈ వయస్సులో ఉన్న పెద్దలు హెర్పెస్ జోస్టర్ వ్యాధి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు దాని లక్షణాలు మరియు సమస్యల నుండి తమను తాము రక్షించుకోవడానికి టీకా ఎంపికల గురించి చర్చించడానికి వారి వైద్యుడిని సంప్రదించాలి. 

 

ముగింపు

 

హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ యొక్క పునఃసక్రియం వల్ల కలిగే బాధాకరమైన వైరల్ వ్యాధి, ఇది చికెన్‌పాక్స్ (అమ్మవారు) రావడానికి కారణమయ్యే వైరస్ 2#. ఈ పరిస్థితి ఒక వ్యక్తి జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది 1. ఇది తరచుగా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్నప్పటికీ 4, దాని కారణాలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు చికెన్‌పాక్స్ చరిత్ర 2, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యం 6 మరియు అంతర్లీన వైద్య పరిస్థితులు వంటి కారకాలను కలిగి ఉంటాయి 6. ఈ ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా, వ్యక్తులు తమకు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు.

హెర్పెస్ జోస్టర్ వచ్చే అవకాశాలను మరియు దాని సంభావ్య సమస్యలను తగ్గించడానికి టీకాలు వేయడం, ముఖ్యంగా 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఒక ప్రభావవంతమైన మార్గం 23

హెర్పెస్ జోస్టర్ వ్యాధి మరియు దాని నివారణ గురించి మరింత సమాచారం కోసం, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. 

References

# Individual patient symptoms of Shingles may vary. These statements are based on some patients’ descriptions of their shingles' pain and do not represent every patient’s experience.

 

  1. Johnson RW et Al. BMC Med. 2010;8(1):37.
  2. Weaver BA. J Am Osteopath Assoc. 2009;109(6 Suppl 2):S2
  3. CDC Shingles (Herpes Zoster) Clinical overview. Available from: Clinical Overview of Herpes Zoster (Shingles) | CDC Accessed Jan 2025
  4. Harpaz R et al. MMWR Recomm Rep. 2008 Jun 6;57(RR-5):1-30.
  5. Bhavsar, S. M., & Mangat, C. (2023). Congenital Varicella Syndrome. StatPearls Publishing.
  6. Nair, P. A., & Patel, B. C. (2023). Herpes Zoster. StatPearls Publishing.
  7. Lokeshwar MR;Indian pediatrics;2000;37;714-719
  8. Simon AK et al. Proc Biol Sci 2015;282:2014–3085.
  9. Marra F et al. Open Forum Infect Dis. 2020;7:1-8.
  10. Huang CT, et al. J Clin Endocrinol Metab. 2022 Jan 18;107(2):586-597.
  11. Batram M et al. Dermatol Ther (Heidelb) (2021) 11:1009–1026.
  12. The immune system and cancer. (2014, October 29). Cancer Research UK. https://www.cancerresearchuk.org/about-cancer/what-is-cancer/body-systems-and-cancer/the-immune-system-and-cancer
  13. Bhavsar A et al. Open Forum Infectious Diseases;2022;1-29.
  14. CDC. (2024c, May 14). Shingles symptoms and complications. Shingles (Herpes Zoster). https://www.cdc.gov/shingles/signs-symptoms/?CDC_AAref_Val=https://www.cdc.gov/shingles/about/symptoms.html
  15. eMedicineHealth; 2021; 1-69; Shingles Treatment, Causes, Pictures & Symptoms (REF-143781)
  16. CDC Shingles (Herpes Zoster) Complications. Available at: https://www.cdc.gov/shingles/about/complications.html. Accessed Jan 2025
  17. Shingles myths and facts. (2019, December 31). NFID; National Foundation for Infectious Diseases. https://www.nfid.org/resource/shingles-myths-and-facts/
  18. Katz J, et al. Surg Clin North Am. 1999;79(2):231-252.
  19. Zoster vaccines for Australian adults. NCIRS.2022;1-17.
  20. Kedar S et al. Journal of Neuro-Opthalmology;2019;39;220-231.
  21. Espiritu R et al. Infectious Disease in Clinical Practice;2007;15;284-288.
  22. Crouch AE. NCBI Bookshelf;2022;1-12- Intro (p.1)
  23. CDC Shingles (Herpes Zoster) Vaccination. Available from https://www.cdc.gov/shingles/vaccination.html. Accessed Jan 2025.
  24. CDC Understanding How Vaccines Work. Available from: https://www.cdc.gov/vaccines/hcp/conversations/understanding-vacc-work.html Accessed on 29th Jan 2025 
     

Cl code: NP-IN-HZU-WCNT-250001 Dop: February 2025

మరింత చదవండి

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు మధుమేహం: సంబంధం, ప్రభావం మరియు నివారణ

    19-03-2025
    Read more »
  • కార్డియోవాస్క్యులర్ వ్యాధులు మరియు షింగిల్స్: వాటి సంబంధం మరియు ప్రభావం అర్థం చేసుకోవటం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ దద్దురు మరియు లక్షణాలను అర్థం చేసుకోవటం: మీరు ఏమి తెలుసుకోవలసి ఉంది

    19-03-2025
    Read more »
  • ఊపిరితిత్తుల వ్యాధి గల రోగులలో షింగిల్స్: ఆస్తమా మరియు COPDల ప్రభావం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ వ్యాధి మరియు లక్షణాలు: సంకేతాలు మరియు నివారణ పూర్తి స్థూల దృష్టి

    19-03-2025
    Read more »