యే సైన్స్ హై”: కొత్త షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) అవగాహన మరియు నివారణ ప్రచారం కోసం జిఎస్‌కెతో అమితాబ్ బచ్చన్ మరియు మనోజ్ పహ్వా భాగస్వామ్యం అయ్యారు

sticker banner

ముంబయి: జిఎస్ కె ఈ రోజు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  అవగాహన గురించి ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది, ఇందులో చికెన్‌పాక్స్ మరియు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మధ్య గల శాస్త్రీయ సంబంధాన్ని అనుభజ్ఞులైన కథానాయకులు అమితాబ్ బచ్చన్ మరియు మనోజ్ పహ్వా వివరిస్తారు. షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)   గురించి మరియు డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే విషయం గురించి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే రోజువారీ సంభాషణలను ఈ ప్రచార చిత్రాలు ఉపయోగిస్తాయి.1

 

ఈ ప్రచారంపై మనోజ్ పహ్వా మాట్లాడుతూ, “షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)2కు గురయ్యే వయో సమూహంలో నేను ఉన్నాను, మరియు జిఎస్ కె యొక్క షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) అవగాహన ప్రచారాల ద్వారా నేను ఈ బాధాకరమైన వ్యాధి మరియు దాని సంబంధిత ప్రమాద కారకాల3 గురించి మరింత అర్థం చేసుకున్నాను. నేను అనేకమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యాను మరియు సాంక్రమిక వ్యాధులకు గురైనప్పుడు ఒక చురుకైన మరియు సంపూర్ణమైన జీవితాన్ని గడపడమనేది ఎంత కష్టమో తెలుసు. షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రభావం మరియు నివారణ యొక్క ప్రాముఖ్యత గురించి వ్యక్తులకు అవగాహన కల్పించడానికి గల ఈ ప్రోత్సాహకంలో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. 50 సంవత్సరాలకు పైబడిన వారందరినీ, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు నివారణ గురించి వారి డాక్టర్‌లతో మాట్లాడమని నేను ప్రోత్సహిస్తున్నాను” అని అన్నారు.

 

చికెన్‌పాక్స్ వచ్చిన వ్యక్తి నరాలలో నిద్రాణంగా(అణిగిపోయి) ఉన్న వైరస్ తిరిగి క్రియాశీలం కావడం వల్ల షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వస్తుంది.4 డయాబెటిస్ ఉండి చికెన్‌పాక్స్ చరిత్ర ఉన్నవారికి షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వచ్చే ప్రమాదం 40% ఎక్కువగా ఉంటుంది.5 రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి,6 మరియు అలా జరిగినప్పుడు అది చికెన్‌పాక్స్ వైరస్ తిరిగి క్రియాశీలం అయ్యే మరియు షింగిల్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు.7

విగ్యేత అగర్వాల్, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ఎంపవర్మెంట్ హెడ్, జిఎస్‌కె మాట్లాడుతూ, "2023 ఎపిఐ-ఐపిఎస్ఓఎ సర్వేలో షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  ఉన్నవారికి కూడా ఈ బాధాకరమైన వ్యాధికి కారణం తెలియదని తేలింది.8 50 సంవత్సరాలు పైబడిన వారందరూ షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మరియు దాని నివారణ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  కారణం వెనుక ఉన్న శాస్త్రాన్ని మరియు చికెన్ పాక్స్ మరియు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మధ్య సంబంధాన్ని సరళమైన పద్ధతిలో వివరించాలనుకుంటున్నాము. అమితాబ్ బచ్చన్ అన్ని వర్గాల ప్రజలతో కనెక్ట్ అయ్యే అసమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రచారానికి ఆయనను ప్రతినిధిగా కలిగి ఉండటం వల్ల, ముఖ్యంగా వృద్ధులను చేరుకోవడానికి మరియు వారి డాక్టర్‌తో షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మరియు దాని నివారణ గురించి మాట్లాడటానికి ప్రోత్సహించడానికి మాకు సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము.”

 

హరికృష్ణ పిళ్ళై, కో-ఫౌండర్ మరియు సిఇఓ, బ్లిట్జ్‌క్రైగ్, దిస్మాల్‌బిగ్ఐడియా నెట్వర్క్ శాఖ మాట్లాడుతూ, "ఈ ప్రచారంలో రెండు ప్రచార చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు వయసుమళ్ళిన స్నేహితులు స్కూల్ రోజులను గుర్తుచేసుకుంటున్నట్లు చూపిస్తుంది మరియు చికెన్‌పాక్స్ మరియు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది, మరొకటి ఇద్దరు స్నేహితుల మధ్య ప్రియమైన బంధాన్ని చిత్రీకరిస్తుంది మరియు డయాబెటిస్ ఉన్నవారికి షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  వచ్చే ప్రమాదం పెరగడంపై దృష్టి పెడుతుంది. 'ఇది శాస్త్రమే' ప్రచారం 50 సంవత్సరాలు పైబడిన పెద్దలను షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మరియు దాని నివారణ గురించి వారి డాక్టర్‌తో మాట్లాడమని కోరుతుంది. అందుకునే సందేశాలు స్పష్టంగా మరియు గుర్తుండిపోయేలా ఉన్నాయి."

 

ఆర్. బల్కి, ది డైరక్టర్, చిత్రానికి గల కళాత్మకమైన భావన గురించి వ్యాఖ్యానిస్తూ, " షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  అనేది చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే వ్యాధి. షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)  మరియు చికెన్‌పాక్స్ మధ్య సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకునే మరియు ఆకర్షణీయమైన రీతిలో మాట్లాడటం సవాలుగా ఉంటుంది. దిస్మాల్‌బిగ్ఐడియా సరళమైన మరియు బలమైన సందేశాన్ని ఎలా రూపొందించిందో నాకు తక్షణమే అర్థమైంది. ఈ సందర్భంలో, సృజనాత్మకత కాదు, స్పష్టత చాలా కీలకమైనది."

 

ఈ ప్రచార చిత్రాలు యూట్యూబ్ (మొబైల్ మరియు కనెక్టెడ్ టీవీ), గూగుల్ డిస్ప్లే, మెటా, ఎంపిక చేసిన ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లు, పేటీఎం, గూగుల్ పే, మరియు హిందీ మరియు ప్రాంతీయ భాషలలో జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లు (జిఇసి), సినిమాలు మరియు వార్తలు వంటి బహుళ శైలులను విస్తరించి ఉన్న వివిధ టీవీ ఛానెల్‌లతో సహా పెక్కు ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేస్తారు. అదనంగా, ఈ ప్రచారం కోసం ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి)తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

  • 7 కీలకమైన టీకాలతో తల్లితండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకు సహకరించమని జిఎస్‌కె యొక్క కొత్త ప్రచారం అడుగుతోంది

    25-07-2024
    6 min read
    Read more »