7 కీలకమైన టీకాలతో తల్లితండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకు సహకరించమని జిఎస్‌కె యొక్క కొత్త ప్రచారం అడుగుతోంది

ముంబయి: జిఎస్‌కె ఈరోజు దాని కొత్త మల్టీఛానల్ ప్రచారం “అబ్ ఇండియా బనేగా 7-స్టార్” ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ ప్రచారం భారతదేశ భవిష్యత్తు తల్లితండ్రుల చేతులలో ఉందనేది వారికి చూపుతుంది. 14 వ్యాధులకు** వ్యతిరేకంగా గల 7 ముఖ్యమైన టీకాలతో* వారి పిల్లలను కాపాడుకోవడానికి ఇది వారిని ప్రోత్సహిస్తుంది, ఈ వ్యాధులలో చికెన్ పాక్స్(ఆటలమ్మ), హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, మెనింజైటిస్(పటలశోథ), మీజిల్స్(తట్టు), గవదబిళ్ళలు, రూబెల్లా, న్యుమోనియా, ఇన్ఫ్లుయెంజా(విషపడిసెం), డిఫ్తీరియా(కంఠవాతం), టెటనస్(ధనుర్వాతం), పెర్టుసిస్(కోరింతదగ్గు), హెచ్ఐబి సంక్రమణ మరియు పోలియో ఉన్నాయి.
1 నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఇండియన్ అకాడెమీ ఆఫ్ పెడియాట్రిక్స్(ఐఏపి) 7 టీకాలను సిఫారసు చేస్తుంది: చికెన్పాక్స్ మరియు హెపటైటిస్ ఎయొక్క రెండు మోతాదులు, మెనింజైటిస్# మరియు ఎంఎంఆర్ యొక్క రెండవ మోతాదు, పిసివి మరియు డిటిపి హెచ్ఐబి ఐపివి యొక్క బూస్టర్ మోతాదులు, మరియు ఫ్లూ యొక్క వార్షిక మోతాదు1. భారతదేశంలో మొదటి సంవత్సరం ఇమ్యూనైజేషన్ కవరేజీ ఎక్కువగా ఉన్నప్పటికీ, 1వ (మొదటి) పుట్టినరోజు తరువాత డ్రాప్-అవుట్ రేటు పెరుగుతోంది. అందువలన, దేశంలో గణనీయసంఖ్యలో పిల్లలు పాక్షికంగా టీకాలను2 పొందుతున్నారు.
జిఎస్‌కె మెడికల్ డైరెక్టర్, డాక్టర్ షాలిని మీనన్ మాట్లాడుతూ, "పిల్లల మొదటి పుట్టినరోజు తర్వాత, తీవ్రమైన టీకా-నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా కీలకం. టీకా ద్వారా ఇవ్వబడిన రోగనిరోధక శక్తి సమాజానికి విస్తరించి, తద్వారా వ్యాధి వ్యాప్తిని నివారిస్తుంది మరియు యాంటీబయాటిక్స్ అవసరాన్ని తగ్గించడం ద్వారా పెరుగుతున్న యాంటీమైక్రోబయల్ నిరోధకత ముప్పును పరిష్కరించడంలో సహాయపడవచ్చు. ఈ వయస్సులో ఇవ్వబడిన 7 ముఖ్యమైన టీకాలు వారిని 14 ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షిస్తాయి మరియు వారు ఆరోగ్యకరమైన వయోజనులుగా ఎదగడానికి సహాయపడతాయి. ఈ ప్రచారం ద్వారా, 1 మరియు 2 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు సిఫార్సు చేయబడిన టీకాలు ఇవ్వవలసిన ముఖ్యమైన అవసరాన్ని తల్లిదండ్రులకు తెలపాలనుకుంటున్నాము."

ఈ ప్రచార చిత్రాల యొక్క ప్రధాన సృజనాత్మక దృష్టి 7 టీకాల యొక్క కీలకమైన అవసరం మీద ఉంది. రెండు ప్రచార చిత్రాలు ఒక క్రికెటర్ మరియు అంతరిక్ష-కేంద్ర మిషన్ డైరెక్టర్ వంటి వివిధ రంగాలలోని నిపుణులు తమ ముఖ్యమైన ఉద్యోగాలను ఆపి, ఒక బిడ్డ 7 ముఖ్యమైన టీకాలు వేయించుకున్నాడో లేదో తనిఖీ చేయడాన్ని చూపిస్తాయి. భారతదేశంలోని ప్రస్తుత 'స్టార్స్' భారతదేశంలోని భవిష్యత్తు 'స్టార్స్' తల్లిదండ్రులకు శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నట్లు చిత్రాలలో సంగ్రహించారు. పిల్లల భవిష్యత్తును భద్రపరచడం ఏ ఇతర ఉద్యోగం కంటే చాలా ముఖ్యమైనదని మరియు ఈ భవిష్యత్తు 7 టీకాలు అందించే 7-స్టార్ రక్షణపై ఆధారపడి ఉంటుందని ఈ చిత్రాలు సమర్థవంతంగా తెలుపుతాయి.
ఈ ప్రచారం టివి, డిజిటల్, సోషల్ మీడియో, రేడియా, సిటివి(కనెక్టడ్ టివి), మరియు ఒటిటి వంటి బహుళ మీడియా ప్లాట్‌ఫాంలలో చూపబడుతుంది. తల్లితండ్రులు పిల్లల కోసం టీకా షెడ్యూల్ గురించి మరింత తెలుసుకోవడానికి వారి పెడియాట్రీషిన్లను సంప్రదించాలి మరియు MyVaccinationHub.in వంటి ధృవీకరించబడిన సమాచార వనరులను ఉపయోగించుకోవాలి.
References
- Indian Academy of Pediatrics (IAP) Advisory Committee on Vaccines and Immunization Practices (ACVIP): Recommended Immunization Schedule (2023) and Update on Immunization for Children Aged 0 Through 18 Years.
- Exploring the Pattern of Immunization Dropout among Children in India: A District-Level Comparative Analysis
Cl code: NP-IN-PVU-WCNT-250007 Dop: March 2025
మరింత చదవండి
-
యే సైన్స్ హై”: కొత్త షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) అవగాహన మరియు నివారణ ప్రచారం కోసం జిఎస్‌కెతో అమితాబ్ బచ్చన్ మరియు మనోజ్ పహ్వా భాగస్వామ్యం అయ్యారు
12-08-20246 min readRead more »