ప్రతి తల్లి తన బిడ్డ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటుంది. హెపటైటిస్ ఏ, మెనింజైటిస్ (పటల శోథ), ఫ్లూ, డిటిపి, మొదలైనవాటి వంటి ప్రమాదకరమైన వ్యాధులకు వ్యతిరేకంగా బిడ్డను కాపాడడం ద్వారా టీకాలు దీవెనలకు మరింత శక్తిని అందిస్తాయి. టీకా కార్డుతో మీ పిల్లల టీకా రికార్డులను ట్రాక్ చేయండి.
మీ బిడ్డ తీసుకున్న అన్ని టీకాల చరిత్రను టీకా కార్డు(కొన్నిసార్లు వ్యాధినిరోధక కార్డుగా పిలవబడుతుంది) తెలుపుతుంది మరియు తీసుకోబోయే టీకాల వివరాలను మీరు తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. తద్వారా మీరు ఏ ఒక్కదానిని మర్చిపోరు.
సాధారణంగా, పెడియాట్రీషియన్ (పిల్లల వైద్యులు) మీకు టీకా కార్డును అందిస్తారు. 18 సంవత్సరాల వయసు వరకు సిఫార్సు చేయబడిన టీకాల గురించి మరింత తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.
టీకా కార్డు మీ పిల్లల ఆరోగ్యానికి పాస్పోర్ట్.
మీ బిడ్డ టీకా కార్డును ఈ రోజే పరీక్షించండి మరియు సమయానికి మీ పిల్లల టీకాలు పూర్తి చేయడానికి మీ శిశువైద్యుని సంప్రదించండి.

మీ బిడ్డ టీకా గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?
మీ సందేహాలకు సమాధానాల కోసం క్రింద చదవండి:
- వైద్య విజ్ఞానం ఎప్పటికప్పుడు పురోగమిస్తోంది, మరియు ఈ పురోగతిలో భాగంగా కాలక్రమంగా నూతన టీకాల అభివృద్ధి జరుగుతోంది.
- టీకా ద్వారా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, కొన్ని సందర్భాలలో ప్రాణాంతకమైన వాటిని కలిగించే ప్రమాదకరమైన వ్యాధుల నుండి పరిరక్షించడానికి ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లలకు అనేక అవకాశాలు ఉన్నాయి.
- ప్రతి టీకా ముఖ్యమైనదే
- టీకా కార్డును శ్రద్ధగా చూడడం ద్వారా మీ బిడ్డ టీకా రికార్డుల యొక్క ట్రాక్ మీరు కలిగి ఉండవచ్చు.
- మీ బిడ్డ అతని లేదా ఆమె మొదటి షాట్ పొందినప్పటి నుండి మీ బిడ్డ టీకా రికార్డుల ట్రాకింగ్ ఆరంభించండి.
- ఆరోగ్యానికి మీ బిడ్డకు పాస్పోర్ట్ లాగా టీకా కార్డు ఉంటుంది
- మీ బిడ్డ టీకా రికార్డులను భద్రంగా మరియు నవీకరిస్తూ ఉండడం ముఖ్యం, ఎందుకంటే మీ బిడ్డను మీరు స్కూలు, చైల్డ్ కేర్, సమ్మర్ క్యాంప్, లేదా అంతర్జాతీయ ప్రయాణం కొరకు రిజిష్టర్ చేసే సమయంలో వీటిని మీరు అందించాల్సి ఉంటుంది.
- మీ బిడ్డ టీకా రికార్డు యొక్క కాపీను మీరు కలిగి ఉన్నప్పుడు:
- మీరు తేలికగా పొందగలిగిన సురక్షిత ప్రదేశంలో రికార్డును ఉంచండి.
- మీ బిడ్డ యొక్క డాక్టరు సందర్శనలకు ప్రతిదానికీ దీనిని తీసుకురండి
- మీ బిడ్డ టీకా రికార్డు మీద ఇచ్చిన టీకా, తేదీ, మరియు మోతాదును రాయమని డాక్టరు లేదా నర్సును అడగండి.
- మీ బిడ్డ షాట్ పొందిన డాక్టరు ఆఫీసు లేదా క్లినిక్ పేరు రాయండి, తద్వారా మీకు అవసరమైనప్పుడు అధికారిక రికార్డులు ఎక్కడ పొందాలనేది మీకు తెలుస్తుంది.
- బిడ్డ యొక్క చక్కటి ఆరోగ్యానికి నిర్దేశన ప్రకారం టీకా వేయించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అధికారులు సిఫార్సు చేస్తున్నారు.
- అయిన, ఏదైనా కారణంగా మీ బిడ్డ వారు అర్హతకలిగిన ఏదైనా టీకా మోతాదు పొందకపోతే/మర్చిపోతే, మీరు క్యాచ్-అప్ టీకాను ఎంచుకోవచ్చు.
- క్యాచ్-అప్ టీకా అనేది పరిరక్షణ బాకీ ఉన్న లేదా మర్చిపోయిన వ్యాధులకు గరిష్టమైన పరిరక్షణ అందివ్వడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది.
- క్యాచ్-అప్ టీకా గురించి మరింత సమాచారం కొరకు దయచేసి మీ పిల్లల వైద్యుడిని సంప్రదించండి.
- ఇండియన్ అకాడెమీ ఆఫ్ పెడియాట్రిక్స్ అందించే ఇమ్యునైజ్ ఇండియా యాప్లో ఉచిత సేవ కొరకు డౌన్లోడ్ మరియు రిజిష్టర్ చేసుకోవడం ద్వారా మీ బిడ్డ యొక్క టీకా గురించి క్రమవారీగా రిమైండర్ మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడGoogle's Playstore మరియు IOS Appstoreయాప్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
- ఏ టీకా బ్రాండులు లేదా ఉత్పాదనలను రిమైండర్లు అడ్వర్టైజ్, సిఫార్సు లేదా ప్రోత్సహించవు.
మరింత సమాచారం కొరకు మీ పిల్లల వైద్యుడిని సంప్రదించండి.